సవరించిన పోలవరం అంచనాలకు 'నో' చెప్పిన కేంద్రం!

సవరించిన పోలవరం అంచనాలకు ‘నో’ చెప్పిన కేంద్రం!

రాష్ట్ర ప్రభుత్వానికి హస్తినలో ఎదురుదెబ్బ తగిలింది! సవరించిన పోలవరం ప్రాజక్టు అంచనాలను కేంద్రం అంగీకరించలేదు. ఢిల్లీలో ఇవాళ పోలవరం ప్రాజక్టు అంశంపై రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజక్టు నిర్మాణంలో భాగంగా సరికొత్త అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ అంచనాలకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ అభ్యంతరం చెప్పింది.

దీనిపై మరిన్ని వివరాలు ఇవ్వాలంటూ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఏపీని కోరింది. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

Leave a Reply