శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుడు మిస్సింగ్..!

హైదరాబాద్ : శంషాబాద్  ఎయిర్పోర్ట్ లో ఒక  ప్రయాణీకుడు అదృశ్యమైన సంఘటన వెలుగులోకి వచ్చింది . విదేశాల నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన క్రమంలో ఆయన మిస్ కావడం కలకలం రేపుతోంది. విదేశాల నుంచి సొంతగడ్డపై అడుగుపెట్టి ఇంటికి చేరుకోక ముందే ఈ ఘటన జరగడం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. మరో 15 రోజుల్లో అతడి వివాహం జరగనున్న నేపథ్యంలో స్వదేశానికి తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణీకుడు అదృశ్యమయ్యారనే వార్త అలజడి రేపింది. మంగళవారం నాడు రాత్రి లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రవీణ్ అనే యువకుడు కనిపించకుండా పోవడం చర్చానీయాంశమైంది. సొంతగడ్డపై అడుగు పెట్టగానే ఆయన అదృశ్యం కావడంపట్ల అనుమానాలకు తావిస్తోంది.