వైసీపీ నేత పృథ్వీకి బంపరాఫర్.. ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా త్వరలో నియామకం!

ప్రముఖ కమెడియన్ నటుడు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీకి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీని సీఎం జగన్ నియమించబోతున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే పృథ్వీకి సమాచారం ఇచ్చినట్లు చెప్పాయి.

ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని చెబుతున్నారు. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా వ్యవహరించారు. అయితే టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఏడాదిన్నర తర్వాత తన పదవికి రాఘవేంద్రరావు రాజీనామా సమర్పించారు. వయోభారం కారణంగానే ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అప్పట్లో రాఘవేంద్రరావు పేర్కొన్నారు.
Tags: Andhra Pradesh,YSRCP,Prudhvi,Comedian,SVBC Channel,Chairman