వైసీపీ అధినేత జగన్ ముక్కుసూటి మనిషి: నటి హేమ

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ముక్కుసూటి మనిషి అని టాలీవుడ్ నటి హేమ తెలిపారు. రుణమాఫీ చేస్తానని చెప్పి ఉంటే జగన్ 2014లోనే ముఖ్యమంత్రి అయ్యేవారన్నారు. ‘అమలు చేయలేని హామీలను నేను చెప్పను, అబద్ధం చెప్పలేను’ అని అప్పుడు జగన్ అన్నారని నటి హేమ గుర్తుచేశారు. అదే సమయంలో రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇంకా ఆ హామీని పూర్తిచేయలేకపోయారని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ మాట్లాడారు.

కాపుల రిజర్వేషన్ విషయంలో కూడా చంద్రబాబు హామీని నిలబెట్టుకోలేదని హేమ విమర్శించారు. కానీ జగన్ మాత్రం ‘ఈ రిజర్వేషన్ చేయడం వీలుకాక పోవచ్చు. జరగకపోవచ్చు’ అని ముక్కుసూటిగా మాట్లాడారని తెలిపారు. ఇది కాపులకు నచ్చకపోయినా జగన్ డొంకతిరుగుడు మాటలు మాట్లాడలేదని చెప్పారు.  .