వైసీపీకి అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ వీరే: చంద్రబాబు

వైసీపీకి అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ వీరే: చంద్రబాబు

వైసీపీని టీఆర్ఎస్ కు డమ్మీగా జగన్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీకి అధ్యక్షుడు కేసీఆర్ అని… వైసీపీ, టీఆర్ఎస్ లకు సంయుక్త వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీపై నిలువెల్లా ద్వేషంతో కేసీఆర్ కుటుంబం ఉందని… వారు చేస్తున్న వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని చెప్పారు. తెలుగుతల్లిని అవమానించిన కేసీఆర్ తో జగన్ కు దోస్తీ ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ముందు పెట్టుబడి పెడతారని… ఆ తర్వాత జగన్ కప్పం కడతారని అన్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రతిష్ఠ కోసం తాను అహర్నిశలు కష్టపడుతుంటే… అప్రతిష్ఠ తెచ్చేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ 10 రోజుల్లోనే రాష్ట్రానికి రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. టీడీపీ సమాచారం దోపిడీపై ఇప్పటికే సిట్ ఏర్పాటైందని, ఓట్ల తొలగింపు కుట్రను ఛేదిస్తామని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఈరోజే రూ. 3,500 జమ చేసే వీలు కల్పించామని చెప్పారు. వైసీపీకి మహిళలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దొంగలను నమ్మబోమని మహిళలు సంకల్పం చేయాలని చెప్పారు.