వైయస్ వివేకానందరెడ్డి ఒంటిపై ఏడు కత్తిపోట్లు!

వైయస్ వివేకానందరెడ్డి ఒంటిపై ఏడు కత్తిపోట్లు!

వైయస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి చంపారు. పోస్టుమార్టం నివేదికలో ఈ మేరకు తేలింది. ఆయన ఒంటిపై ఏడు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. తొడ, చేతిపైన కూడా రెండు గాయాలు ఉన్నట్టు తేలింది. నుదిటిపై రెండు పదునైన గాయాలు, తల వెనుక మరో గాయం ఉంది.

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయనున్నారు. కేసుకు సంబంధించి కొన్ని క్లూస్ కూడా దొరికాయని, వీటి ఆధారంగా విచారణ జరుపుతామని పోలీసు అధికారులు చెప్పారు. మరోవైపు కర్నూలు నుంచి ఫోరెన్సిక్ నిపుణులు పులివెందులకు రానున్నారు.

గుండెపోటుతో వివేకా మరణించారని తొలుత వార్తలు వచ్చాయి. తాజాగా వివేకాది హత్య అని తేలడం ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకు పాల్పడింది ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.