వేరే కులమైనందుకు అన్నంతపనీ చేశారు… ఎమ్మెల్యే కుమార్తె భర్త దారుణ హత్య!

  • బరేలీ ఎమ్మెల్యేగా ఉన్న రాజేశ్ మిశ్రా
  • మరో కులపు యువకుడిని పెళ్లాడిన రాజేశ్ కుమార్తె
  • అలహాబాద్ హైకోర్టు ముందు దారుణ హత్య

తాను వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందున, తన తండ్రి నుంచి ప్రాణహనీ ఉందని ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే కుమార్తె సోషల్ మీడియాలో పెట్టిన వీడియో గతవారంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భయపడినంతా అయింది. అలహాబాద్ హైకోర్ట్ ముందు, వందలాది మంది చూస్తుండగా, బరేలి ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కుమార్తె సాక్షి మిశ్రా భర్త అభితేష్ కుమార్‌ ను కొందరు దారుణంగా హతమార్చారు.

కాగా, తనను చంపడానికి తండ్రి కొందరిని పంపితే తప్పించుకున్నామని, భవిష్యత్తులో తన భర్తకు గానీ, అతని బంధువులకు గానీ ఏమైనా హానీ జరిగితే, అది తండ్రి, సోదరుడు విక్కీ బాధ్యులని, తమకు పోలీసులు రక్షణ కల్పించాలని సాక్షి కోరిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, తన కుమార్తె, ఆమె కన్నా వయసులో 9 ఏళ్లు పెద్దయిన వ్యక్తిని పెళ్లాడటం నచ్చలేదని, ఆమె ఇంటికి వస్తే ఆహ్వానిస్తామని రాజేశ్ వ్యాఖ్యానించారు. అంతలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. అభితేష్ హత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Tags: Uttar Pradesh,Allahabad,MLA,Rajesh Mishra,Sakshi Misra,Murder