విశాఖలో ఫ్యాక్షన్ పడగలు తప్పవు: పవన్ హెచ్చరిక

విశాఖలో ఫ్యాక్షన్ పడగలు తప్పవు: పవన్ హెచ్చరిక

రాపాక వైసీపీ స్టాండ్ తీసుకోవడం బాధించింది
జగన్ తన వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు
అమరావతి తరలింపు నిర్ణయం తాత్కాలికమే
తనను పార్టీ కార్యాలయం నుంచి బయటకు రానివ్వకపోవడంపై జనసేన అధినేత పవన్ తీవ్రస్థాయిలో స్పందించారు. తనను బయటకు వెళ్లనివ్వకపోవడం దారుణమన్న పవన్.. జనసేన ఎమ్మెల్యే రాపాక వైసీపీ స్టాండ్ తీసుకోవడం తనను బాధించిందన్నారు. విశాఖపట్టణంపై వైసీపీకి ఎంతమాత్రమూ ప్రేమ లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖను రాజధాని అని అంటున్నారని ఆరోపించారు. 5 కోట్ల మంది ప్రజలు ఆమోదించిన తర్వాత మళ్లీ ఇప్పుడు రాజధాని తరలింపు ఏంటని ప్రశ్నించారు.

టీడీపీ చేసిన తప్పులే వైసీపీ చేస్తోందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని తరలించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. విశాఖలో ఫ్యాక్షన్ పడగ విప్పడం ఖాయమని అన్నారు. రాజధాని తరలింపు నిర్ణయం తాత్కాలికమేనన్న జనసేనాని.. జగన్ తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. జాతీయ స్థాయిలో బలమైన మార్పులు జరగబోతున్నాయని చెప్పారు. ఏపీ పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Tags: Janasena,Pawan Kalyan,Amaravati