వచ్చే ఎన్నికల తర్వాత జగన్ సీఎం కావడం ఖాయం: రోజా

జగన్ అధికారంలో కొస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది
ఏపీలో ప్రతిపక్షంపై కక్ష సాధింపు రాజకీయాలు తగదు
నగరిలో వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేసిన రోజా
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, జగన్ సీఎం కావడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో వ్యాపారులకు తోపుడు బండ్లను ఈరోజు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ప్రతిపక్షంపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో నగరి నుంచి తాను పోటీ చేసే అవకాశం జగన్ కల్పించారని, ఆయన నమ్మకాన్ని ప్రజలు వమ్ముచేయకుండా తనను గెలిపించారని, వారి రుణం జీవితంలో మర్చిపోలేనని అన్నారు.