ఈస్టర్ పండుగ సందర్భంగా జీసస్ గురించి చెప్పిన చంద్రబాబు

లోకేశ్ భద్రత కుదింపు… బ్రాహ్మణి, భువనేశ్వరిలకు పూర్తిగా తొలగింపు!

  • లోకేశ్ కు ఇప్పటివరకూ 5 ప్లస్ 5 గన్ మెన్లు
  • 2 ప్లస్ 2కు కుదించిన ప్రభుత్వం
  • మండిపడుతున్న టీడీపీ శ్రేణులు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత మాజీ సీఎం చంద్రబాబుకు ఉన్న భద్రతను కుదించిన ఏపీ సర్కారు, ఇప్పుడు మాజీ మంత్రి లోకేశ్ భద్రతనూ తగ్గించింది. ఆయనకు ఇప్పటివరకూ 5 ప్లస్ 5 గన్ మెన్ల భద్రత ఉండగా, దాన్ని 2 ప్లస్ 2కు కుదించింది. ఇదే సమయంలో చంద్రబాబు కుటుంబీకుల్లో ఆయనకు, లోకేశ్ కు మినహా మిగతా అందరి భద్రతను పూర్తిగా తొలగించింది. ఇక తమ అధినేతకు భద్రత తగ్గించడం, బ్రాహ్మణి, భువనేశ్వరి వంటి వారికి పూర్తిగా తొలగించడంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే గన్ మెన్లను వెనక్కు తీసుకున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్న వేళ, వైసీపీ నాయకులపై ఏ మాత్రం పక్షపాతం చూపలేదని, జగన్ పాదయాత్రకు సైతం పూర్తి స్థాయి భద్రత కల్పించామని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆరోపిస్తున్నారు.

Leave a Reply