రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది టీడీపీ నేతలను కోల్పోవడం కలచివేస్తోంది: చంద్రబాబు

ఎంవీవీఎస్ మూర్తి మరణంపై చంద్రబాబు సంతాపం
గాంధీ ఆదర్శాల కోసం పనిచేసిన మూర్తి
తనకు అత్యంత సన్నిహితుడున్న చంద్రబాబు
రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది తెలుగుదేశం పార్టీ నేతలను కోల్పోవడం తనను కలచివేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా సేవలందించిన ఎంవీవీఎస్ మూర్తి మరణంపై ఆయన సంతాపాన్ని వెలిబుచ్చారు. ఆయన మృతి వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.

గాంధీ ఆదర్శాల కోసం పనిచేసిన ఆయన గాంధీ జయంతినాడే దారుణ ప్రమాదానికి గురికావడం యాదృచ్చికమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, విద్యావేత్తగా, విద్యాదాతగా చెరగిపోని ముద్ర వేసిన వ్యక్తి ఆయనని అన్నారు. మూర్తి మరణం విద్యా రంగానికి, రాజకీయ రంగానికీ తీరనిలోటని, తనకు అత్యంత సన్నిహితుల్లో ఆయన కూడా ఒకరని మూర్తితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.