రూ. 999కే విమానం టికెట్... ఇండిగో ఆఫర్ మూడు రోజులే!

రూ. 999కే విమానం టికెట్… ఇండిగో ఆఫర్ మూడు రోజులే!

జూన్ 14 వరకూ ఆఫర్ అందుబాటులో
సెప్టెంబర్ 28 వరకూ ప్రయాణించే చాన్స్
ఇంటర్నేషనల్ రూట్లో రూ. 3,499 నుంచి టికెట్లు
దేశవాళీ లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో ప్రత్యేక స్పెషల్‌ సమ్మర్‌ సేల్‌ ను ప్రకటించింది. ఇందులో భాగంగా కేవలం రూ. 999కే విమాన ప్రయాణ టికెట్ ను అందిస్తున్నామని, ఈ నెల 14 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ మూడు రోజుల్లో టికెట్లను కొనుగోలు చేసేవారు, జూన్‌ 16 నుంచి సెప్టెంబర్‌ 28 ప్రయాణపు తేదీలను నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. ఇక ఇంటర్నేషనల్ ట్రావెల్ విషయానికి వస్తే, ప్రారంభ టికెట్‌ ధర రూ. 3,499 నుంచి మొదలవుతుందని ఇండిగో పేర్కొంది. జూన్ లో తాము ఇచ్చిన ఆఫర్ కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించిందని ఈ సందర్భంగా సంస్థ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విలియం బౌల్టర్‌ వెల్లడించారు. అందువల్లే మరో ఆఫర్ ను ప్రయాణికులకు అందించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
Tags: Indigo today offers,special summer offer,999 offers