రామ మందిర్ కమిటీకి నృపేంద్ర మిశ్రా నాయకత్వ 0

అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షించే కమిటీకి నృపేంద్ర మిశ్రా నాయకత్వం వహిస్తారు. మిశ్రా గతంలో ప్రధాని మోడీ వద్ద ప్రిన్సిపాల్ సెక్రెటరీగా పనిచేసారు. బుధవారం నాడు మాజీ సొలిసిటర్ జనరల్ , సీనియర్ అడ్వకేట్ శ్రీ పరాశరన్ నివాసంలో జరిగిన శ్రీ రామ జన్మ తీర్థ ట్రస్ట్ మొదటి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రామ మందిర్ ట్రస్ట్ ప్రెసిడెంట్ గా మహంత్ నిత్యగోపాల్ దాస్ , జనరల్ సెక్రటరీ గా చంపత్ రాయ్ లను ఎన్నుకున్నారు. రామ మందిర్ నిర్మాణం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలనీ సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది .