రాజమౌళితో రజనీకాంత్ మూవీ?

రాజమౌళితో రజనీకాంత్ మూవీ?

సంక్రాంతికి రానున్న ‘పేట’
ఆ తరువాత మురగదాస్ తో సెట్స్ పైకి
రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనట
రజనీకాంత్ ఇక తన పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయిస్తారనే టాక్ ఒక వైపున వినిపిస్తుంటే, అందుకు భిన్నంగా రజనీ వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ వెళుతున్నారు. ఈ సంక్రాంతికి ఆయన ‘పేట’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన మురుగదాస్ తో ప్లాన్ చేసుకున్నారు. విభిన్నమైన కంటెంట్ తో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించడానికి మురుగదాస్ సన్నాహాలు చేసుకుంటున్నాడట.

ఆ తరువాత సినిమాను మళ్లీ కార్తీక్ సుబ్బరాజ్ తోనే చేస్తానని రజనీ ఆయనకి మాట ఇచ్చాడట. మురుగదాస్ .. కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు పూర్తయిన తరువాత, రాజమౌళితో రజనీ సినిమా వుండే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టు రజనీకాంత్ తోనే ఉంటుందనే వార్త కోలీవుడ్లో జోరుగా షికారు చేస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.