రజనీకాంత్ సినిమాలో తెలుగమ్మాయి?

మళ్లీ కెమెరా ముందుకు నమిత
‘సాహో’కు ‘బాహుబలి’ టెక్నీషియన్
‘మహానటి’ హక్కులకు భారీ రేటు
* రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందే సినిమాలో తెలుగమ్మాయి అంజలి ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై అంజలిని అడిగితే, ఈ విషయంపై అప్పుడే మాట్లాడనంటూ తప్పించుకుంది. అంటే, అధికారికంగా చిత్రం యూనిట్ ప్రకటిస్తుందన్న జవాబు ఆమె మాటల్లో కనిపిస్తోంది.
* ఆమధ్య పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిన బొద్దుగుమ్మ నమిత మళ్లీ ఇప్పుడు కెమెరా ముందుకు రావడానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు టి.రాజేందర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో లేడీ విలన్ పాత్రను ఆమె పోషించనున్నట్టు సమాచారం.
* ‘బాహుబలి’ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ టెక్నీషియన్ కమల్ కన్నన్ తాజాగా ‘సాహో’ చిత్రానికి కూడా వీఎఫ్ఎక్స్ పనులను చేబడుతున్నాడు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది.
* సావిత్రి బయోపిక్ గా వచ్చిన ‘మహానటి’ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ చిత్రం శాటిలైట్ హక్కులకు విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ హక్కులను జీటీవీ 18 కోట్లు ఆఫర్ చేసి సొంతం చేసుకున్నట్టు సమాచారం.