యూపీని స్వీప్ చేస్తాం.. 300 స్థానాలు మావే: బీజేపీ

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో క్లీస్ స్వీప్ చేస్తామని యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ సరిగా అంచనా వేయలేక పోయాయని… తాము 300 స్థానాల్లో విజయదుంధుభి మోగించడం ఖాయమని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో మాత్రమే కాకుండా, 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో సైతం యూపీలో బీజేపీ హవానే కొనసాగుతుందని ఆయన జోస్యం చెప్పారు.

403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీకైనా 202 స్థానాలు అవసరం. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్స్… సీట్లను గెలుచుకునే విషయంలో మాత్రం బీజేపీకి 200 స్థానాల వరకు కట్టబెట్టాయి.

5 రాష్ట్రాల ఎన్నికల లేటెస్ట్ ట్రెండ్స్ ఇవే!
ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ ఇవి.
ఉత్తరప్రదేశ్: మొత్తం స్థానాలు 403 – ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 217
బీజేపీ – 139, సమాజ్ వాదీ, కాంగ్రెస్ – 47, బీఎస్పీ – 31, ఇతరులు – 8
పంజాబ్: మొత్తం స్థానాలు 117, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 45
కాంగ్రెస్ – 24, అకాలీదళ్, బీజేపీ – 6, ఆప్ 15
ఉత్తరాఖండ్: మొత్తం స్థానాలు 70, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 9
బీజేపీ – 6, కాంగ్రెస్ – 3
మణిపూర్: మొత్తం స్థానాలు 60, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 10
బీజేపీ – 3, కాంగ్రెస్ – 6, ఇతరులు -1
గోవా: మొత్తం స్థానాలు 40, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 7
బీజేపీ – 4, కాంగ్రెస్ 3