యనమలకు పుచ్చిపోయిన పళ్ల కోసం రూ.3 లక్షలు ఎలా ఇచ్చారు?: వైసీపీ ఎమ్మెల్యే రోజా

విదేశీ పర్యటనలు పెట్టుబడుల కోసమనుకున్నా!
పెట్టుడుపళ్లు పెట్టించుకోవడానికని అనునుకోలేదు
ఆడపిల్ల పుడితే ఇచ్చేందుకు ఖజానాలో డబ్బుల్లేవట
ఆడపిల్ల పుడితే ఇవ్వడానికి రూ.30 వేలు ఖజానాలో లేవంటున్నారు, మరి, మంత్రి యనమలకు పుచ్చిపోయిన పళ్ల కోసం రూ.3 లక్షలు ఎలా ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఏపీ మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్తుంటే పెట్టుబడుల కోసమనుకున్నాం కానీ, పెట్టుడుపళ్లు పెట్టించుకోవడానికని అనుకోలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో పొత్తులు లేకుండా వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.