“మోడీ పతనానికి నాంది పడింది”

కోల్ కత్తా,
మోదీ పతనానికి కోల్‌కతా‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’సభ నాంది అన్నారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2019లో దేశ ప్రజలు కొత్త ప్రధానిని చూడబోతున్నారని జోస్యం చెప్పారు. శనివారం కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’సభలో చంద్రబాబు ప్రసంగించారు. బెంగాల్‌లో తన ప్రసంగాన్ని ప్రారంభించి ఆకట్టుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. జెండాలను పక్కన పెట్టి మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఓసారి ఢిల్లీలో సమావేశమైన ప్రతిపక్ష పార్టీలు.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలను మొదలు పెట్టాయి. త్వరలోనే అమరావతిలో కూడా విపక్షాల ఐక్య వేదిక సభ (యునైటెడ్ ఇండియా ర్యాలీ) ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కోల్‌కతా వేదిక నుంచే జాతీయ స్థాయి నేతలంతా సభకు రావాలని ఆహ్వానం పలికారు. నేతలు కూడా సానుకూలంగానే స్పందించారు. బీజేపీయేతర కూటమి ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచి చంద్రబాబు అమరావతిలో సభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గతంలోనే తన మనసులో మాటను జాతీయ స్థాయి నేతలకు వివరించారు. డిసెంబర్‌లోనే సభ ఏర్పాటు చేయాలునుకున్నా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావిడి ఉండటంతో అది కాస్త ఆలస్యమయ్యింది. ఇప్పుడు మళ్లీ సభ ఏర్పాటుపై క్లారిటీ వచ్చింది. త్వరలోనే టీడీపీ సీనియర్లతో చర్చించి సభ ఎప్పుడు నిర్వహించాలన్నది చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటు చేసే సభతో ధర్మపోరాట దీక్షకు ముగింపు పలకాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఈ సభ ద్వారా దేశం మొత్తానికి తెలియజేయాలనుకుంటున్నారు. హోదా, విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు టీడీపీ అధినేత.విపక్షాల ఐక్యత కోసం ఇలాంటి గొప్ప సమావేశం ఏర్పాటు చేసిన మమతా బెనర్జీని చంద్రబాబు అభినందించారు. ‘దేశ ప్రజల్ని బీజేపీ మోసం చేసింది.. అబద్ధపు వాగ్థానాలతో అధికారంలోకి వచ్చింది. బీజేపీ విభజించి పాలించు విధానాన్ని అవలంభిస్తూ.. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. ఆర్బీఐ, సీబీఐ, ఈడీ వంటి సంస్థల్ని కేంద్రం భ్రష్టు పట్టించింది. అలాగే రాఫెల్ డీల్ పెద్ద అవినీతి స్కాం.. రాఫెల్‌పై సుప్రీం కోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు’అని విమర్శించారు. ‘నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. గత నాలుగేళ్లలో ఆర్థిక అభివృద్ది మందగించింది. దేశంలో పెట్రోల్ రేట్లు భగ్గుమంటున్నాయి. ధరల పెరుగుదలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. నాలుగేళ్ల పాలనలో రైతులు మోసపోయారు.. రైతుల కష్టాలు బీజేపీకి పట్టవు. ఇక రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.‘దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. అది మన బాధ్యత. స్వాత్రంత్ర్య సంగ్రామానికి పశ్చిమబెంగాల్ దశా-దిశ చూపించింది.. అదే స్ఫూర్తితో ప్రతిపక్షాలను ఏకం చేయాలనుకుంటున్నాం. మా అందరి నినాదం ఒక్కటే సేవ్ ఇండియా.. సేవ్ డెమోక్రసీ.. 2019లో దేశ ప్రజలు కొత్త ప్రధానిని చూడబోతున్నారు’.ప్ర‌ధాని మోదీ ఓ ప‌బ్లిసిటీ పీఎం అని, కానీ మ‌న‌కు ప‌నిచేసే ప్ర‌ధాని కావాల‌ని బాబు అన్నారు. కోల్‌క‌తాలో జ‌రుగుతున్న ఐక్య‌త ర్యాలీలో మాట్లాడుతూ.. త‌మ‌కు దేశాన్ని ఐక్యంగా ఉంచాల‌న్న ఉద్దేశం ఉంద‌ని, కానీ బీజేపీ మాత్రం దేశాన్ని విభ‌జిస్తోంద‌ని తెలిపారు. గ‌తంలో ఆర్థిక అభివృద్ధి బాగుండేద‌ని, అయితే ప్ర‌గ‌తి నెమ్మ‌దించ‌డం వ‌ల్ల ఉద్యోగాలు లేవ‌ని అన్నారు. క‌ర్నాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని కూల్చితే, బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈవీఎంలు ఓ పెద్ద ఫ్రాడ్ అన్నారు. ఏ దేశంలోనూ ఈవీఎంల‌ను వాడ‌డం లేద‌ని, మ‌ళ్లీ మ‌నం పేప‌ర్ బ్యాలెట్‌ను తీసుకురావాల‌న్నారు. బీజేపీ ప‌త‌నం ప్రారంభ‌మైంద‌ని, 2019లో కొత్త పీఎం వ‌స్తార‌ని బాబు అన్నారు.
బీజేపీ అధికారంలోకి రాద‌నేందుకు ఇదే సంకేతం..:హార్దిక్ పటేల్
కోల్‌క‌తా: దొంగలకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నట్లు గుజరాత్ పాటిదార్ నాయకుడు హార్ధిక్ పటేల్ తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటీషర్లపై పోరాటం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇప్పుడు మేం దొంగలపై పోరాటం చేయాల్సిందిగా చెబుతున్నామన్నారు. కోల్ బ్రిగేడ్ మైదానంలో తృణముల్ కాంగ్రెస్ నేతృత్వంలో నేడు జరుగుతున్న విపక్షాల ఐక్యర్యాలీ సభలో హార్ధిక్ పటేల్ పాల్గొని ప్రసంగించారు. దేశంలోని అన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకులను ఒకే వేదికపై తెచ్చినందుకు మమతా బెనర్జీకి కృతజ్ఞతలు అన్నారు. బీజేపీ అధికారంలోకి రాద‌నేందుకు ఇదే సంకేతమ‌ని ఆయ‌న పేర్కొన్నారు.
రాజ్యాంగంపైనా దాడి జరుగుతోంది :శరద్ పవార్
 దేశ మహోన్నత రాజ్యాంగంపైనా దాడి జరుగుతోంది అని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై మోదీ ప్రభుత్వ దాడిని దేశం మొత్తం చూస్తోందన్నారు. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విపక్షాల ఐక్య ర్యాలీలో శరద్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఐదేళ్లుగా ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది అని మండిపడ్డారు. కోట్ల మందికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పదవులను ఆశించి తామంతా ఇక్కడకు రాలేదన్నారు. దేశంలో మార్పు సాధించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. తమకు కావాల్సింది పదవులు కాదు.. ఈ దేశ ప్రజల రక్షణ, రైతన్నకు భద్రత, యువతకు భవిష్యత్ అని శరద్ పవార్ స్పష్టం చేశారు
బీజేపీని గద్దె దించాలి : బీఎస్పీ మిశ్రా
 దేశంలోని అన్ని వర్గాల నుంచి ఒక్కటే స్వరం వస్తున్నది.. బీజేపీని గద్దె దించాలని అందరూ కోరుకుంటున్నారని బీఎస్పీ నేత సతీశ్ మిశ్రా స్పష్టం చేశారు. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విపక్షాల ఐక్య ర్యాలీలో సతీశ్ మిశ్రా పాల్గొని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కార్మిక, కర్షక వర్గాలకు ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు సృష్టించింది. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓబీసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంపెనీలు మూతపడ్డాయి. రైతులు నిరాశతో ఉన్నారని మిశ్రా పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. రాజ్యాంగ్నా పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు సతీశ్ మిశ్రా.
కేంద్రం ఐడియాలజీనే వ్యతిరేకం : యశ్వంత్
బీజేపీ ప్ర‌భుత్వ వైఖ‌రి ప‌ట్ల మాజీ కేంద్ర మంత్రి య‌శ్వంత్ సిన్హా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని మోదీ ఒక్క‌ర్ని వ్య‌తిరేకించేందుకు ఈ స‌భ‌ను ఏర్పాటు చేయ‌లేద‌ని, మొత్తం బీజేపీ విధానాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. బీజేపీ అనుస‌రిస్తున్న ఐడియాల‌జీకి తాము వ్య‌తిరేక‌మ‌న్నారు. గ‌త 56 నెల‌లుగా భార‌త ప్ర‌జాస్వామ్యం తీవ్ర ప్ర‌భావానికి లోనైంద‌న్నారు. మోదీ వికాశాన్ని తేలేద‌ని, నాశ‌నం తీసుకువ‌చ్చార‌న్నారు. త‌న‌కు కోరిక‌లు ఏమీ లేవ‌ని, కేవ‌లం బీజేపీ ప్ర‌భుత్వాన్ని నేల‌కూల్చ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. స‌బ్‌కా సాత్ స‌బ్ కా వికాస్ అన్నారు, కానీ ఆ నినాదంలో వికాశం లేద‌ని, కేవ‌లం వినాశ‌న‌మే ఉంద‌న్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ దారుణంగా దెబ్బ‌తింద‌న్నారు. గ‌ణాంకాల‌తో ఈ ప్ర‌భుత్వం ఆట‌లాడుతోంద‌న్నారు.
ఇది రెండో స్వాతంత్ర్య సమరం : స్టాలిన్
మిళంలో మాట్లాడిన ఆయ‌న‌ దేశంలో రెండ‌వ స్వాతంత్య్ర స‌మ‌రం మొద‌లైంద‌న్నారు. మ‌నమంతా క‌లిసి క‌ట్టుగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌నం ఒకటైతే, బీజేపీ ఓట‌మి త‌థ్య‌మ‌న్నారు. అందుకే ప్ర‌ధాని మోదీ మ‌న‌పై ప్ర‌తి వేదిక‌లోనూ విమ‌ర్శిస్తున్నార‌ని అన్నారు. దేశం ప‌ట్ల మోదీ వ్య‌తిరేకంగా ఉంటే, ఆయ‌న‌పై నేను వ్య‌తిరేకంగా ఉంటాన‌ని స్టాలిన్ అన్నారు. మోదీ చేప‌ట్టిన‌ విధ్వంస‌క‌ర విధానాల‌ను డీఎంకే నేత త‌ప్పుప‌ట్టారు. ప్ర‌ధానిపై త‌న‌కు వ్య‌క్తిగ‌త వ్య‌తిరేక‌త ఏమీలేద‌న్నారు. బెంగాల్‌కు, త‌మిళంకు ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌న్నారు. త‌మిళ‌నాడులో స్వామి వివేకానంద స్మార‌కం ఉంద‌ని గుర్తు చేశారు. రాజ‌కీయాల‌తో పాటు ఇత‌ర అంశాల్లోనూ బెంగాలీల త‌ర‌హాలోనే త‌మిళులు ఉంటార‌న్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ పిలుపు మేర‌కు తాను రెండవ స్వాతంత్య్ర ఉద్య‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. అధికారంలోకి రాక‌ముందు న‌ల్ల‌ధ‌నంపై పోరాటం చేస్తామ‌న్నారు. కానీ అదేమీ జ‌ర‌గ‌లేద‌న్నారు. ప్ర‌తి అకౌంట్‌లోకి 15 ల‌క్ష‌లు వ‌స్తాయ‌న్నారు, ఇంత క‌న్నా పెద్ద మోసం ఏమి ఉంటుంద‌ని స్టాలిన్ ప్ర‌శ్నించారు.
బీజేపీని గంగలో కలపాలి : జోషి
తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్య ర్యాలీలో లోక్‌తాంత్రిక్ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో తీవ్రమైన సంక్షోభం ఉందన్నారు. రైతులు తీవ్రమైన నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 7 కోట్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు. దేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను బీజేపీ తన గుప్పిట పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గంగలో నిమజ్జనం చేయాలి. మరో రాజకీయ విప్లవానికి కోల్‌కతా నాంది పలికిందన్నారు. బీజేపీ అవినీతికి రఫేల్ కుంభకోణం ఒక నిదర్శనం అని శరద్ యాదవ్ చెప్పారు
రాజ్యంగ సంక్షోభం నెలకొంది
దేశంలో అసాధార‌ణ రీతిలో సంక్షోభం నెల‌కొని ఉంద‌న్నారు. రాజ్యాంగ స్పూర్తిని ప‌రిర‌క్షించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌న్నారు. సుభాష్ చంద్ర‌బోస్ తెల్ల‌వారితో పోరాడాడు అని, మ‌నం దొంగ‌ల‌తో పోరాడాల‌ని గుజ‌రాత్ నేత హార్థిక్ ప‌టేల్ అన్నారు. త‌న ప్ర‌సంగంలో మోదీ-షాపై ఆయ‌న ఫైర్ అయ్యారు. జార్ఖండ్ ముక్తీ మోర్చా నేత హేమంత్ సోరెన్ కూడా మాట్లాడారు. దేశంలో వాతావ‌ర‌ణం ఆందోళ‌న‌క‌రంగా మారింద‌న్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని, దేశ ఐక్య‌తను కాపాడాల్సిన బాధ్య‌త యువ‌త చేతుల్లో ఉంద‌న్నారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ మాజీ సీఎం గీగంగ్ అపాంగ్ మాట్లాడారు. ప్ర‌స్తుత బీజేపీ ప్ర‌భుత్వం వాజ్‌పేయి సూత్రాల‌ను పాటించ‌డం లేద‌న్నారు. ప్ర‌జాస్వామ్య నిర్ణ‌యాత్మ‌క విధానాన్ని బీజేపీ నాశ‌నం చేస్తోంద‌న్నారు. కేవ‌లం అధికారం కోస‌మే బీజేపీ ప‌నిచేస్తోంద‌న్నారు. కోల్‌క‌తాలోని బ్రిగేడ్ ప‌రేడ్ మైదానంలో జ‌రుగుతున్న ర్యాలీకి భారీ సంఖ్య‌లో జ‌నం హాజ‌ర‌య్యారు.