aa muggurilo yevaro okkaru eliminate avtharu

ముగ్గురి గ్యాంగ్ లో ఒకరు గ్యారెంటీగా అవుట్..

తేజస్వికే ఎక్కువ అవకాశం. ప్రేక్షకుల చేతిలో ట్రిగ్గర్

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2 కి సంబంధించి హౌస్ లో ఆహ్లాదం అనేది లేకుండా చేసేసి,అసలు ఈ గేమ్ రూల్స్ ని బ్రేక్ చేస్తున్న తేజస్వి,తనీష్, సామ్రాట్ గ్యాంగ్ మొత్తం ఈ వారం ఎలిమినేషన్ జాబితాలోకి ఒకేసారి ఎక్కేసింది. బిగ్ బాస్ హౌస్ అంటే సింగిల్ గా ఎవరి గేమ్ వారు ఆడుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ జట్టుకట్టి మిగిలిన వాళ్ళను కావాలని నామినేట్ చేయడం, డామినేట్ చేయడం, వేధించడం వంటివి అస్సలు చేయకూడదు. అయితే బిగ్ బాస్ లో ఈ ముగ్గురూ ఒక్కటై పోయి మిగిలిన అందరిపై కత్తికట్టారు .ఒక్కొరుగా జట్టు కట్టుకుంటూ సింగిల్ గా వుండేవాళ్ళను వేధించడం మొదలు పెట్టారు. ఇంత జరుగుతున్నా దీన్ని అడ్డుకోవడంలో బిగ్ బాస్ నాని పూర్తిగా విఫలమయ్యారు.

దీంతో షో మొత్తం చప్పగా తయారైంది. గీతా మాధురి,కౌశల్, నందిని రాయ్ వంటి వారిపై తేజస్వి దాడిచేయడం, వాళ్ళు తమని తాము కాపాడుకోవడం ఇదే తంతుగా సాగుతూ,ఆడియన్స్ కి చిరాకు కలుగుతోంది. తేజస్వి,సామ్రాట్ , తనీష్ ఈ ముగ్గురూ ఎప్పుడు ఎలిమినేషన్ లోకి వస్తారా అని ఆడియన్స్ ఎదురుచూస్తోంటే, అనుకోకుండా ఒకేసారి ఈ ముగ్గురూ చిక్కారు.నిజానికి వాళ్ళ కుటుంబ సభ్యులు స్నేహితులు తప్ప మొదటి నుంచి బిగ్ బాస్ ను వీక్షిస్తున్న వాళ్ళెవరూ ఓట్లు వేసేవాళ్ళు లేరు. ఇక ఈ గ్యాంగ్ లో ఎవరో ఒకరు బయటకు వెళ్ళిపోతే ఖచ్చితంగా హౌస్ లో మార్పులు వస్తాయి. ఎవరి ఆట వాళ్ళు ఆడుకునే అవకాశం,స్వేచ్ఛగా వారి భావాలను వ్యక్తపరిచేందుకు అవకాశం ఉంటుంది. తేజస్వి నోరు వేసుకుని పడిపోతుందేమో అని చాలామంది నోరు విప్పడం లేదు. ఇక తేజస్వి ని కనుక ఏమైనా అంటే తనిష్ , సామ్రాట్ ఇద్దరూ సపోర్టింగా వచ్చేయడం,ఇక వారిపై కక్ష సాధింపులు చేయడం వంటివి జరుగుతున్నాయి.

ఇక ఈ ముగ్గురిలో కూడా ఎవరో ఒకరు గ్యారంటీగా బయటకు వెళ్లిపోవాలని ప్రేక్షకులు కోరుకోవడం లో తప్పేం లేదు. వీళ్ళుంటే బిగ్ బాస్ ని చూసి ఆనందించే పరిస్థితులు లేకుండా చేస్తున్నారు. నాని చెప్పాడని, తనీష్ గ్రూప్ కి దూరంగా వుంటూ, ఏదైనా గొడవ వస్తే చాలు వీరు ముగ్గురు ఒక్కటై పోతున్నారు. ఇక గత వారం భానుశ్రీ గొడవే దీనికి కారణం. తేజస్వి ఎంటర్ అవ్వగానే ఇంకేమీ పని లేదన్నట్లు సామ్రాట్ తలదూర్చేసాడు. ఇక ఒకే గ్రూపులో ఉన్నప్పటికీ తనీష్ వచ్చేసి,తేజస్వికి సుద్దులు చెబుతూనే, కౌశల్ ఎదో తప్పు చేసాడన్నంత బిల్డ్ అప్ ఇచ్చేసాడు.

ఇవన్నీ చూడాలంటే కంపరంగా ఉందని ఆడియన్స్ తెగ కామెంట్స్ పెడ్తున్నా,నాని బిగ్ బాస్ కూడా మారడం లేదు. నిజానికి కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసేటప్పుడు ఒకరికొకరు పరిచయం లేని వారిని తీసుకోవాలి. అప్పుడే మంచి మజాగా ఉంటుంది. ఇక తేజస్వి, తనీష్, సామ్రాట్ లు బయట కూడా మంచి ఫ్రెండ్స్ . రాగానే తమ స్నేహం కొద్దీ ఒక్కటైపోయి, హౌస్ లో ఉన్న మిగతా వారిని వేధించడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఆడియన్స్ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఆడియన్స్ ఏమి నిర్ణయిస్తారో చూడాలి.

Tags: tejaswi,samrat,thanish,elimination,audience