మీరే 'మీటూ'కు వ్యతిరేకంగా ఉన్నారే?: మండిపట్ట రకుల్, తాప్సి!

మీరే ‘మీటూ’కు వ్యతిరేకంగా ఉన్నారే?: మండిపట్ట రకుల్, తాప్సి!

నటి భావనపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్ కుమార్ కు శుభాకాంక్షలు చెప్పిన చెన్నైకి చెందిన ప్రముఖ పాత్రికేయురాలిపై రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి, మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. భావనను వేధించిన కేసులో దిలీప్ జైలుకు కూడా వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న దీలీప్ కు ఇటీవల ఆడపిల్ల జన్మించింది. ఆయన భార్య కావ్య ప్రసవించగా, సదరు మహిళా పాత్రికేయురాలు, “లవ్లీ కపుల్ దిలీప్‌, కావ్యకు ఆడశిశువు జన్మించింది.. శుభాకాంక్షలు” అని వ్యాఖ్యానించింది. ఇక ‘మీటూ’ ఉద్యమం ఊపందుకున్న వేళ, లైంగిక వేధింపుల కేసు నిందితుడికి శుభాకాంక్షలు చెప్పడం ఏంటని మంచు లక్ష్మి ప్రశ్నించింది. హీరోయిన్లు అందరూ ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతుంటే, నువ్వు మద్దతుగా నిలవడం సిగ్గు పడాల్సిన విషయమని వ్యాఖ్యానించింది.

ఇక ఇదే విషయమై తాప్సి తన సోషల్ మీడియాలో స్పందిస్తూ, “మ‌హిళే మీటూ ఉద్య‌మానికి వ్య‌తిరేఖంగా ప్ర‌వ‌ర్తిసుంటే చాలా ఇబ్బందిక‌రంగా ఉంది” అని చెప్పింది. దిలీప్ వంటి వ్యక్తుల గురించి మీడియా గొప్పగా చెప్పడమేంటని మండిపడింది. “ఇటువంటి ట్వీట్ మీ నుంచి వచ్చిందంటే నమ్మాలని అనిపించడం లేదు. మార్పు మన నుంచే వచ్చిందన్న విషయం గుర్తు పెట్టుకోండి” అని రకుల్ స్పందించింది.