మా నాయన కంటే ఎక్కువ చేస్తా.. నువ్వు చూస్తావ్ అని జగన్ అన్నారు!: యాత్ర దర్శకుడు మహి.వి.రాఘవ్

మా నాయన కంటే ఎక్కువ చేస్తా.. నువ్వు చూస్తావ్ అని జగన్ అన్నారు!: యాత్ర దర్శకుడు మహి.వి.రాఘవ్

వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా మహి.వి.రాఘవ్ ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల అయ్యాక వైసీపీ అధినేత జగన్ తో జరిగిన ఓ సంభాషణను మహి.వి.రాఘవ్ ఈరోజు గుర్తుచేసుకున్నారు.
యాత్ర సినిమా విడుదల అయ్యాక తాను జగన్ ఇంటికి వెళ్లానని మహి తెలిపారు.

‘అన్నా.. మాకు చాలా భావోద్వేగ సందేశాలు వచ్చాయి. వైఎస్సార్ గారు చనిపోయి 9 ఏళ్లయినా ఆయన ప్రజల గుండెల్లో ఇంకా సజీవంగానే ఉన్నారు. వీళ్లల్లో చాలామంది ఆరోగ్య శ్రీ ద్వారా లబ్ధిపొందినవారే అని చెప్పాను. అందుకు జగన్ స్పందిస్తూ.. మా నాయన కంటే ఎక్కువ చేస్తా మహి. నువ్వు చూస్తావు అని చెప్పారు. వైఎస్సార్ పెట్టిన లక్ష్యం చాలా గొప్పది. నిజంగా ఓ అవకాశం ఇస్తే జగన్ అన్న తన మాటను నిలబెట్టుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది’ అని మహి ఈరోజు ట్వీట్ చేశారు.