‘మా’ ఎన్నికల్లో శివాజీరాజా ప్యానల్ ఇదే!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కాలపరిమితి ముగిసింది. దీంతో, ఇప్పటిదాకా ‘మా’ అధ్యక్షుడిగా వ్యవహరించిన శివాజీరాజా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు, అధ్యక్ష పదవి కోసం సీనియర్ నటుడు నరేష్ కూడా నామినేషన్ వేశారు. దీంతో, టాలీవుడ్ లో ఒక్కసారిగా ఎన్నికల వేడి నెలకొంది. గతంలో జయసుధ, రాజేంద్రప్రసాద్ లు అధ్యక్ష పదవికి పోటీపడినప్పుడు నెలకొన్న వాతావరణంలాంటి పరిస్థితే ఇప్పుడు మరోసారి ఏర్పడింది.

శివాజీరాజా ప్యానల్ ఇదే:
ప్రెసిడెంట్: శివాజీరాజావైస్ ప్రెసిడెంట్: ఎస్వీ కృష్ణారెడ్డివైస్ ప్రెసిడెంట్: బెనర్జీఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్జనరల్ సెక్రటరీ: రఘుబాబుజాయింట్ సెక్రటరీ: బ్రహ్మాజీజాయింట్ సెక్రటరీ: నాగినీడుట్రెజరర్: పరుచూరి వెంకటేశ్వరరావు