మానవ అక్రమ రవాణా నిందితురాలితో కేజ్రీవాల్

జార్ఖండ్ యువతులు అక్రమ రవాణా చేస్తున్న ప్రభా మున్నీ
2013 నుంచి పరారీలో ప్రభా
నిన్ననే అరెస్ట్ చేసిన పోలీసులు
మానవ అక్రమ రవాణా రాకెట్ నిందితురాలు ప్రభా మున్నీతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్న ఫొటో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో ప్రభా మున్నీని పోలీసులు అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఈ ఫొటో నెట్టింట పత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో రాజకీయపరగా దుమారం రేపుతోంది. ఐదేళ్లుగా పరారీలో ఉన్న మున్నీని నిన్ననే పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎన్జీవో పేరిట ప్లేస్ మెంట్ ఏజెన్సీని నిర్వహించే మున్నీ… జార్ఖండ్ యువతులకు ఉద్యోగాల పేరుతో ఎరవేసి, ఢిల్లీకి పిలిపించి, వారిని అక్రమ రవాణా చేస్తోందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జార్ఖండ్ లో ఆమెపై పలు కేసులు ఉన్నాయి. 2013 నుంచి ఆమె పరారీలో ఉంది. ప్రస్తుతం ఆమె రిమాండ్ లో ఉంది. కేసు విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.