విభిన్న పంచాంగాలకు స్వస్తి.. పండుగల్లో గందరగోళానికి చెక్.. ఈ ఏడాది నుంచే అమలు

మహేశ్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్ చూస్తే మతిపోయింది: వర్మ

విషయమేదైనా విమర్శించడంలోను .. ప్రశంసించడంలోను రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిని ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఆయన ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో మహేశ్ బాబు నిర్మించిన ‘ఏఎంబీ’ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ను గురించి ప్రస్తావించారు.

‘ఏఎంబీ’ సినిమాస్ మల్టీ ప్లెక్స్ ను సందర్శించాను. ఒక్కో థియేటర్ ను చూస్తుంటే దిమ్మతిరిగిపోయింది. థియేటర్లోని వాతావరణం చూస్తే మతిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్ బాబు ఎంత అందంగా ఉంటాడో .. ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ అంత బ్యూటిఫుల్ గా వున్నాయి” అని ట్విట్టర్ ద్వారా ప్రశంసిస్తూ తన మనసులోని మాటను చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన ఈ మల్టీ ప్లెక్స్ లో మొత్తం ఏడు స్క్రీన్లు ఉంటాయి. ఒకేసారి 1638 మంది కూర్చుని సినిమా చూడవచ్చు. ఈ మల్టీ ప్లెక్స్ థియేటర్స్ ను రేపు రజనీకాంత్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.