వైసీపీలోకి వెళ్లిన వారు మళ్లీ వస్తామంటున్నారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

మహాగరంలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి : ఎన్నికల అధికారి ఎం.దానకిశోర్‌

వికారాబాద్ కలెక్టర్ పై ఎన్నికల సంఘం గుస్సా.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు!Add New

 

  •  ఓటర్లందరూ ఓట్లు వేయాలని పౌరులకు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్‌ విజ్ఞప్తి
    హైదరాబాద్‌  మహా నగరంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిశోర్‌ స్పష్టం చేశారు.   నగరంలో ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.   ఈ ఎన్నికల్లో గట్టి బందో బస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సుమారు 18 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని, వారందరికీ తపాలా ఓటు సౌకర్యం కల్పించామని గుర్తుచేశారు. దివ్యాంగులకు ఉచిత రవాణ వసతి ఉంటుందని   ఓటర్లంతా తమ హక్కును సద్వినియోగం చేసుకుని, గతంకన్నా ఎక్కువ పోలింగ్‌ శాతాన్ని నమోదు చేయాలని పిలుపునిచ్చారు.
  • ఓటరు చిట్టీల పంపిణీ:

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 15 శాసనసభ స్థానాలున్నాయి. అందులోని 14 స్థానాలు సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ ఎంపీ స్థానాల పరిధిలో ఉండగా, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే స్థానం మల్కాజిగిరి ఎంపీ స్థానంలో ఉంటుంది. ఆయా శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 3,976 పోలింగ్‌ ఉన్నాయని దానకిశోర్‌ తెలిపారు. గతంలో లేనివిధంగా ఈ దఫా మూడు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఓటర్ల సంఖ్య 1,500 దాటింది. 1,500కన్నా ఎక్కువ ఓటర్లుంటే అదనపు పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు గతంలో కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపేది. కానీ అనుమతించలేదన్నారు. వీవీ ప్యాట్‌కు 2 వేలకుపైగా చిట్టీలను ముద్రించే సామర్థ్యం ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘం అలా నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఓటరు చిట్టీలను 98 శాతం పంపిణీ చేశామన్నారు. ప్రతి కేంద్రంలో ప్రాథమిక చికిత్సకు అవసరమైన వస్తువులను ఉంచుతున్నామని, డీఆర్‌సీ కేంద్రాల వద్ద ఓ వైద్యుడు, నర్సులు, అంబులెన్సు, ఇతర సామగ్రితో శిబిరాన్ని తప్పనిసరి చేశామన్నారు.

24వేల ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాం..   సుమారు 45 వేల గుర్తింపుకార్డులపై విచారణ జరిపించాం. తొలగింపు సక్రమంగా జరగని 24 వేల ఓటరు కార్డులను తిరిగి జాబితాలో చేర్చాం. పకడ్బందీగా ఓటరు సర్వే చేపట్టి జాబితాను ప్రక్షాళన చేశామ’ని దానకిశోర్‌ వివరించారు. శాసనసభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటైన డీఆర్‌సీ (ఈవీఎంల తరలింపు, స్వీకరణ, లెక్కింపు కేంద్రాలు) కేంద్రాలకు ఈవీఎంల తరలింపు పూర్తయిందన్నారు.

సీసీ కెమెరాలు, లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌.. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 10శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించాలి. కానీ నగరంలో 25 శాతం పోలింగ్‌ కేంద్రాలను ఎంపికచేశాం. వెయ్యి పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించడంతోపాటు, మిగిలిన 2,976 కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటిలో రికార్డయ్యే విజువల్స్‌ ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి చేరుతాయని, అక్కడ వాటిని సమీక్షించేందుకు ఇద్దరు ఐఏఎస్‌, ఓ ఐపీఎస్‌ అధికారి ఉంటారని తెలిపారు. డీఆర్‌సీ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉందని, కేంద్ర బలగాలు, రాష్ట్ర, నగర పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నిక ముగిశాక ఈవీఎంలన్నీ డీఆర్‌సీ కేంద్రాలకు వస్తాయని, స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంల భద్రతను పోటీలో ఉన్న అభ్యర్థులు ఎప్పుడైనా తెలుసుకోవచ్చన్నారు. డీఆర్‌సీ కేంద్రాల బయట స్ట్రాంగ్‌రూముల్లోని విజువల్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసే కమ్యునికేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.