మనం మరో సర్జికల్ స్ట్రయిక్ చేశాం: భారత్ విజయంపై అమిత్ షా

పాక్ పై భారత్ ఘన విజయం
క్రీడాభిమానుల సంబరాలు
అభినందనలు తెలుపుతున్న ప్రముఖులు
గత రాత్రి భారత క్రికెట్ జట్టు, పాకిస్థాన్ పై ఘన విజయం సాధించడంపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తనదైన శైలిలో స్పందించారు. భారత్ చేతిలో పాక్ ఓడిపోయిన నేపధ్యంలో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు సంబరాలు జరుపుకుంటున్న వేళ, అమిత్ షా, టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ, “పాకిస్థాన్ పై టీమ్ ఇండియా మరో సర్జికల్ స్ట్రయిక్ చేసింది. భారత టీమ్ మొత్తానికీ అభినందనలు. ఈ అత్యద్భుత విజయం ప్రతీ భారతీయునికీ గర్వకారణం” అని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. ఇదే సమయంలో కేంద్ర క్రీడా శాఖా మంత్రి కిరణ్ రిజిజు “హిందుస్థాన్ గెలుస్తుందని, పాకిస్తాన్ ఓడిపోతుందని ముందే చెప్పాం. ఇండియన్ టీమ్‌ కు అభినందనలు” అని అన్నారు.

Leave a Reply