మత సామరస్యానికి ప్రతీక… తన బిడ్డతో కృష్ణుడి వేషం వేయించిన ముస్లిం మహిళ!

  • ఆదిలాబాద్ జిల్లా ఇచ్చడలో ఘటన
  • తన బిడ్డ హయాన్ ను ముస్తాబు చేసిన శంషాద్ భానూ
  • ప్రశంసించిన పలువురు

మత సామరస్తానికి ప్రతీక అంటే, ఇంతనకన్నా గొప్ప సాక్ష్యం మరొకటి ఉండదేమో. తన చిన్నారికి శ్రీకృష్ణుడి వేషం వేయించిన ఓ ముస్లిం తల్లి మురిసిపోయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చడ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో జరిగింది. ఇక్కడి విద్యానగర్ కాలనీలోని శంషాద్ భాను, లతీఫ్ దంపతుల బిడ్డ హయాన్, ఫస్ట్ స్టెప్ పాఠశాలలో చదువుతుండగా, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా చిన్ని కృష్ణుని అలంకరణలో స్కూలుకు వచ్చాడు. వేడుకల్లో హయాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. పరమతాన్ని గౌరవించడమే నిజమైన భారతీయతని శంషాద్ భానూ చెప్పకనే చెప్పిందని పలువురు ఆమెను ప్రశంసించారు.