భారత్ సరిహద్దులో భారీ బంగారు గనులు.. తవ్వకాలు ప్రారంభించిన చైనా

అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దును ఆనుకుని భారీ బంగారు గని
తవ్వకాలు ప్రారంభించిన చైనా
రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు ‘డ్రాగన్’ ప్లాన్
చైనా అధీనంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల విలువైన భారీ బంగారు, వెండి, ఇతర ఖనిజాల గనులు ఉన్నట్టు హాంకాంగ్‌కు చెందిన ఓ పత్రిక తెలిపింది. గనులు ఉన్నట్టు చెబుతున్న ప్రాంతంలో చైనా ఇప్పటికే తవ్వకాలు ప్రారంభించినట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వెల్లడించింది. చైనా ఇక్కడ ఎప్పటి నుంచో తవ్వకాలు జరుపుతున్న చైనా, ఇటీవల వాటిని మరింత పెంచిందని వివరించింది.

అరుణాచల్ ప్రదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్న ళుంజె కౌంటీలో ఉన్న గనులను సొంతం చేసుకునేందుకు చైనా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని పత్రిక పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌ను ఇప్పటికే వివాదాస్పద ప్రాంతంగా చెబుతున్న డ్రాగన్ కంట్రీ దక్షిణ టిబెట్‌లో అరుణాచల్ ప్రదేశ్ భాగమని వాదిస్తోంది. ఇప్పుడు ఖనిజాల తవ్వకాలతో అరుణాచల్ ప్రదేశ్‌ను క్రమంగా చేజిక్కించుకునే ప్లాన్‌లో భాగమే ఈ గనుల తవ్వకమని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తన కథనంలో వివరించింది.