టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ ఆగిన ట్రాఫిక్

భాగ్యనగరికి బారులు… టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ ఆగిన ట్రాఫిక్!

  • దసరా కోసం స్వస్థలాలకు వెళ్లిన ప్రజలు
  • తిరిగి హైదరాబాద్ కు క్యూ
  • భారీగా నిలిచిపోయిన వాహనాలు

దసరా పర్వదినాల కోసం స్వస్థలాలకు తరలివెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ చేరుకునేందుకు క్యూ కట్టారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, ఒంగోలు తదితర ప్రాంతాలకు వెళ్లిన వారు, వెనక్కు వస్తుండగా, టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ముఖ్యంగా విజయవాడ కాజ టోల్ ప్లాజాతో పాటు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న పతంగి తదితర ప్లాజాల వద్ద ప్రయాణికులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయారు. టోల్ బూత్ ల సంఖ్యను పెంచినప్పటికీ, వస్తున్న వాహనాల సంఖ్య అధికంగా ఉండటంతో సమస్య తప్పలేదని టోల్ నిర్వాహకులు వెల్లడించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ దిశగా హైవే పెట్రోలింగ్ పోలీసులు పట్టించుకోలేదని ప్రజలు విమర్శలు గుప్పించారు.