బిగ్ బాస్ సీజన్-12కు రూ. 288 కోట్లు వసూలు చేస్తున్న సల్మాన్ ఖాన్!

  • 12 రోజులు షూటింగ్ లో పాల్గొననున్న సల్మాన్
  • రోజుకు రెండు ఎపిసోడ్ల చిత్రీకరణ
  • ఎపిసోడ్ కు రూ. 12 కోట్ల వసూలు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పటికే 11 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్-12 ప్రారంభంకానుంది. ఈ షోకు కూడా సల్మానే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే, ఈ సీజన్ కు ఆయన తీసుకోబోతున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తిరగకమానవు. మూడు నెలల పాటు ప్రసారం కానున్న ఈ షో కోసం సల్మాన్ మొత్తం 12 రోజులు మాత్రమే షోలో పాల్గొనబోతున్నాడు. ఈ 12 రోజుల్లో మొత్తం 24 ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారు. ఒక్కో ఎపిసోడ్ కు రూ. 12 కోట్లను సల్మాన్ వసూలు చేస్తున్నాడట. ఈ లెక్కన మొత్తం 24 ఎపిసోడ్లకు సల్మాన్ కు ముట్టనున్న రెమ్యునరేషన్ అక్షరాలా రూ. 288 కోట్లు. సల్మాన్ కే ఇంత ఇస్తుంటే.. ఇక షో నిర్వాహకులకు ఎంత మిగులుతుందో ఊహించవచ్చు.