బాలల దినోత్సవం.. మనవడు దేవాన్ష్ తో వేడుకలు జరుపుకున్న సీఎం చంద్రబాబు!

ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు
మనవడితో కలిసి నవంబర్ 14 వేడుకలు
ఫేస్ బుక్ లో ఫొటో పోస్ట్ చేసిన టీడీపీ అధినేత
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పండిట్ నెహ్రూకు చిన్నారులంటే చాలా ఇష్టం కావడంతో ఆయన పుట్టిన రోజైన నవంబర్ 14న దేశవ్యాప్తంగా పిల్లల పండుగగా జరుపుకుంటారు. కాగా, ఈ బాలల దినోత్సవాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ తో కలిసి ఉండవల్లిలో ఈ రోజు జరుపుకున్నారు. బాలల పండుగ ఎందుకు జరుపుకుంటున్నారో చంద్రబాబు ఈ సందర్భంగా దేవాన్ష్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరితో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.