బదామీలో బొటాబొటిగా గెలిచిన సిద్ధరామయ్య!

  • శ్రీరాములుపై 3 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ
  • వెల్లడించిన ఈసీ అధికారులు
  • బాదామిలో వెల్లడైన ఫలితం
  • చాముండేశ్వరిలో మాత్రం ఓటమి అంచున

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీపడిన సీఎం సిద్ధరామయ్య బదామీలో బొటాబొటిన గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీరాములుపై 3 వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యంలో విజయం సాధించినట్టు ఎలక్షన్ కమిషన్ అధికారులు ప్రకటించారు. ఆయన పోటీపడ్డ మరో నియోజకవర్గం చాముండేశ్వరిలో ఓడిపోయారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి శరాఘాతం కాగా, ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం సందడిలేక బోసిపోయింది. బీజేపీ సాధారణ మెజారిటీ సాధించడంలో విఫలమైతే, కుమారస్వామిని కలుపుకుని అధికారాన్ని నిలుపుకోవాలన్న ఏకైక ఆశతో ఆ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్, గెళ్సాట్ తదితరులు బెంగళూరులోని ఓ స్టార్ హోటల్ లో మకాం వేసి, తుది ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.