ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు శ్రీనివాసులరెడ్డి సూసైడ్‌ దర్యాప్తు ముమ్మరం

ఏపీ సీఎం జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైన సాక్ష్యాల కోసం పోలీసులు కూపీ లాగుతున్నారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు శ్రీనివాసులరెడ్డి సూసైడ్‌ దర్యాప్తు ముమ్మరంగా సాగుతొంది ముఖ్యంగా కేసులో అనుమానితుడైన శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య, ఆయన రాసినట్లుగా చెబుతున్న లేఖపై పోలీసులు దృష్టి పెట్టారు. లేఖను శ్రీనివాసులురెడ్డి రాశాడా? ఎవరైనా చేశారా నిర్ధారించేందుకు దాన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయించారు. కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న డీజీపీ గౌతం సవాంగ్‌ కడప చేరుకుని నిన్నటి వరకు అక్కడే విచారణ జరిపారు. . ఈ కేసుకు సంబంధించి పలు అంశాలపై సమీక్షించిన ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందానికి అవసరమైన సూచనలు చేశారు.

కాగా యీ కేసులో డీజీపీ పర్యటన అంతా రహస్యంగా సాగడం, పోలీసులు సైతం దీనిపై నోరు మెదపక పోవడంపట్ల ఏం జరుగుతుందొనన్నా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కీలక అనుమానితుగా భావిస్తున్న నలుగురిని కొన్ని రోజుల క్రితం నార్కో అనాసిస్‌ పరీక్షల కోసం గుజరాత్‌ తీసుకువెళ్లారు. అక్కడ కీలక సమాచారం వెల్లడైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇది జరిగిన కొన్ని రోజులకే శ్రీనివాసులురెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందడం మిస్టరీగా మారింది.

శ్రీనివాసులురెడ్డి కేవలం అనుమానితుడు మాత్రమే. అతనిపై కేసు కూడా నమోదు కాలేదు. అలాంటప్పుడు అతను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నదనే విశయం అంతా మిస్టరీగా మారింది. . మరోవైపు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు శ్రీనివాసురెడ్డి కాదని అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అన్ని కోనాల్లో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. లేఖలో అక్షరాలు ఒక్కోచోట ఒక్కోలా ఉండడకపోవడంపై కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు లేఖను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది.