ప్రత్యేక హోదా ఆందోళన కేసులన్నీ ఎత్తేయండి: సీఎం జగన్ ఆదేశం

  • ఏపీకి ప్రత్యేక హోదా కోసం అప్పట్లో వేలాది మందిపై కేసుల నమోదు
  • కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశంలో  సీఎం జగన్ నిర్ణయం
  •  కేసులను ఎదుర్కుంటున్న వారికి లభించనున్న ఊరట

ప్రత్యేక హోదా ఆందోళనలో పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని ఏపి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు .  ఏపీకి ప్రత్యేక హోదా కోసం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, బంద్ లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పట్లో వేలాది మందిపై కేసులు నమోదయ్యాయి. హోదా పోరాటంలో పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రజావేదికలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమావేశం సందర్భంగా ఈ కేసుల అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసులను ఎత్తివేయాలంటూ ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో కేసులను ఎదుర్కొంటున్న వేలాది మందికి ఊరAP cs, cslv subramanyam, ys jagan mohan reddy,amaravathi prajavedhikaట లభించనుంది.