ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం..!

  • కూల్చివేస్తున్నట్టు సీఆర్డీఏకు సమాచారమిచ్చిన రెవెన్యూ అధికారులు
  • ఏసీలు, ఫర్నిచర్ ను జాగ్రత్త చేసుకోవాలంటూ సూచన
  • కలెక్టర్ల సదస్సు ముగిసిన వెంటనే కూల్చివేత పనులు మొదలయ్యే అవకాశం

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసే కార్యక్రమం మొదలైంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజావేదికను కూల్చివేస్తున్నట్టు సీఆర్డీఏకి రెవెన్యూ అధికారులు సమాచారం ఇచ్చారు. ప్రజావేదికలో ఉన్న ఏసీలు, ఫర్నిచర్, ఇతర వస్తువులన్నింటినీ జగ్రత్త చేసుకోవాలని సూచించారు. ఈరోజు కలెక్టర్ల సదస్సు ముగిసిన వెంటనే కూల్చివేత పనులు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సమావేశాల నిర్వహణ కోసం అమరావతిలో మరో వేదికను నిర్మించే యోచనలో ఉన్నారు. జగన్ ఆమోదం తెలిపిన తర్వాత కొత్త వేదికను నిర్మించాలని నిర్ణయించారు.