polavaram reverse tendering

పోలవరం రివర్స్ టెండరింగ్

ఎవరెన్ని చెప్పినా వినకుండా తాము చేయాలనుకున్నది మొండిగా చేసి తీరుతోంది ఏపీ ప్రభుత్వం. పోలవరం పనులలో రివర్స్ టెండరింగ్ నష్టమే తప్ప లాభం లేదని అందరూ మొత్తుకున్నా వినకుండా రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది. తాజాగా పోలవరం పనులను ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లు పిలిచింది. పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ కొద్ది సేపటి క్రితం జారీ చేసింది. మొత్తం 4 వేల 900 కోట్ల రూపాయలకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది.

హెడ్ వర్క్స్ లో మిగిలి పోయిన పనులకు 1800 కోట్ల రూపాయలు, హైడల్ ప్రాజెక్టుకు 3,100 కోట్ల రూపాయలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్ నోటిఫికేషన్ ను జలవనరులశాఖ వెబ్ సైట్ లో పెట్టింది. 2015-16 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించింది. గతంలో అంచానాలను భారీగా పెంచారని గత ప్రభుత్వం మీద ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేసింది. రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దంటూ కేంద్ర జల వనరుల శాఖ చేసిన సూచనలను, అలాగే ప్రాజెక్టు త్వరగా పూర్తవ్వాలంటే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్కే రాసిన లేఖను సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది.