‘పోలవరం’ రికార్డు సాధనకు చెమటోడ్చిన అందరికీ అభినందనలు: సీఎం చంద్రబాబు

‘పోలవరం’ రికార్డు సాధనకు చెమటోడ్చిన అందరికీ అభినందనలు: సీఎం చంద్రబాబు

కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు ఓ చారిత్రక ఘట్టం
ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ సమయమిది
ఇదే స్ఫూర్తితో పని చేసి ప్రాజెక్టును పూర్తి చేద్దాం
పోలవరం స్పిల్ వే కాంక్రీట్ ఫిల్లింగ్ పనులు గిన్నిస్ రికార్డును నెలకొల్పడంపై సీఎం చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు సాధించడం ఓ చారిత్రక ఘట్టమని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ సమయమిదని, ఈ రికార్డు సాధించడంలో చెమటోడ్చిన వేలాది కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బందికి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రాజెక్టును పూర్తి చేద్దామని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపు నిస్తూ ఓ పోస్ట్ చేశారు. కాగా, కేవలం 24 గంటల వ్యవధిలోనే 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను, నిన్న ఉదయం నుంచి నవయుగ సంస్థ చేపట్టిన సంగతి తెలిసిందే.