పవన్ బాబాయ్ బర్త్ డేకి సర్ ప్రైజ్ చేయనున్న అబ్బాయ్!

  • రేపు పవన్ కల్యాణ్ పుట్టినరోజు
  • మెగా అభిమానుల్లో ఆనందోత్సాహాలు
  • చరణ్ సినిమా నుంచి వీడియో బిట్

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని నటిస్తోంది. ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయకపోవడంతో, అందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 2వ తేదీన ఫస్టులుక్ ను విడుదల చేయవచ్చని వాళ్లంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉపాసన ఒక వీడియోను పోస్ట్ చేసింది. బాబాయ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, వీడియో రూపంలో ఒక సర్ ప్రైజ్ ఉంటుందని ఈ వీడియోలో చరణ్ చెప్పాడు. అయితే, ఫస్టులుక్ తో పాటు ఈ సినిమాకి సంబంధించిన వీడియో కూడా ఏదైనా వదులుతారా? లేదంటే కేవలం వీడియో మాత్రమే రిలీజ్ చేస్తారా? అనేది తెలియాల్సింది.