పవన్‌,చంద్రబాబు పై బొత్స సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ : టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేనాని అధినేత పవన్‌కల్యాన్ రాజకీయ బినామీ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ అందుకే టీడీపీకి అనుకూలంగా పవన్‌ విన్పిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అమరావతి నిర్మాణాలకు అదనంగా మూడు రెట్లు ఖర్చవుతుందని, రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగదని బొత్స భరోసా ఇచ్చారు. ఐనా రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను తాము నెరవేర్చుతామని, అమరావతితో పాటు అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని బొత్స హామీ ఇచ్చారు. . రాష్ట్రంలో సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్‌ చేస్తామన్నారు. సీఎం జగన్‌ వంద రోజుల పాలనకు 100 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రాజధానిని దనకొండకు మార్చే అవకాశాలున్నాయా అని మీడియా ప్రశ్నించగా.. దొనకొండా… అదెక్కడుందని మీడియాకు బొత్స ఎదురు ప్రశ్న వేశారు. వరల్డ్‌ బ్యాంక్ తనంతట తానే వెళ్లదని, ఏపీలో సంక్షేమానికి సాయం చేసేందుకు వరల్డ్‌ బ్యాంక్‌ ఇప్పటికీ సిద్ధంగా ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు.