నేర చరిత్రులను నియంత్రించలేం. పార్లమెంటే తగిన చర్యలు తీసుకోవాలి

 

ఎన్నికలలో నేర చరితులు పోటీ చేయకుండా నిరోధించేందుకు పార్లమెంటు తగిన చర్య లు చేపట్టాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. నేరచరితులను ఎన్నికలలో పోటీ చేయకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పలు పిటీషన్లను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారంనాడు ఈ తీర్పు ఇచ్చింది. నేర చరిత్ర కలిగిన వారు చట్టసభలకు రాకుండా నిరోధించేందుకు పార్లమెంటు తగిన చర్యలు తీసుకుని, భారత ఎన్నికల సంఘానికి తగు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధులకు సంబంధించిన కేసు వివరాలను తమ వెబ్ సైట్లలో పెట్టాలని, అటువంటి వారి గురించి ప్రజలకు సమాచారం ఇవ్వాల్సి ఉందని, అభ్యర్ధులు తమ నేర చరిత్రపై భారత ఎన్నికల సంఘానికి పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉందని సుప్రీం కోర్టు ఆభిప్రాయపడింది.