నేడు గోదావరి ఖనిలో కెసిఆర్ బహిరంగ

 

 

 

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం గోదావరిఖనిలో తెరాస బహిరంగసభ నిర్వహించనుంది డిగ్రీ కళాశాల మైదానంలో . సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఈ సభకు  మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో పాల్గొంటారు.  ఈ సమావేశంపై  పెద్దపల్లి తెరాస ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌ నేత గెలుపు కోసం బలమైన సింగరేణి కార్మికుల హాజరుపై ఎమ్మెల్యేలంతా ఆశలు పెట్టుకున్నారు.  పెద్దపల్లి ఎంపీ స్థానం పరిధిలోని పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.