నేడు కూడా పెంచేశారు… రూ. 90 దాటి సెంచరీ దిశగా పెట్రోలు పరుగులు!

నేడు పెట్రోలుపై 14 పైసల ధర పెంపు
డీజిల్ ధర 10 పైసల పెంపు
హైదరాబాద్ లో రూ. 87.84కు పెట్రోలు ధర
పెట్రోలు, డీజిల్ ధరలు మంగళవారం నాడు కూడా పెరిగాయి. ఇప్పటికే రూ. 90ని దాటిన లీటర్ పెట్రోలు ధర, సెంచరీ దిశగా శరవేగంగా సాగుతోంది. నేడు పెట్రోలుపై 14 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించగా, ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 90.22కు చేరుకుంది. ఢిల్లీలో రూ. 82.86కు, కోల్ కతాలో రూ. 86.48కు, చెన్నైలో రూ. 86.13కు, హైదరాబాద్ లో రూ. 87.84కు పెట్రోలు ధర పెరిగింది.

ఇదే సమయంలో లీటర్ డీజిల్‌ పై 10 పైసల ధర పెరుగగా, ఢిల్లీలో రూ. 74.12కు, ముంబైలో రూ. 78.69కు, కోల్‌ కతాలో రూ. 75.97కు, చెన్నైలో రూ. 78.36కు హైదరాబాద్‌ లో రూ. 80.62కు ధర పెరిగింది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతూ ఉండగా, డాలర్‌ తో రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటంతో ‘పెట్రో’ ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడుతోంది.