నెలాఖరుకి వస్తున్న ‘అభిమన్యుడు’

‘రంగస్థలం’ సెట్లో చిరంజీవి షూటింగ్
‘జంబ లకిడి పంబ’ రిలీజ్ డేట్
రెజ్లర్ గా రానున్న రానా
* విశాల్, సమంత కలసి తమిళంలో నటించిన ‘ఇరుంబు తిరై’ చిత్రం అక్కడ హిట్ చిత్రంగా నిలిచింది. కాగా, ‘అభిమన్యుడు’ పేరిట తెలుగులోకి అనువదించిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సైబర్ నేరాల చుట్టూ సాగే కథతో రూపొందిన ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు.
* ‘రంగస్థలం’ సినిమా కోసం హైదరాబాదులో వేసిన విలేజ్ సెట్లో ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం షూటింగ్ చేస్తున్నారు. అక్కడి బంగ్లా సెట్లో చిరంజీవి, తమన్నా తదితరులు పాల్గొనే సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.
* కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘జంబ లకిడి పంబ’ చిత్రాన్ని వచ్చే నెల 14న విడుదల చేయడానికి నిర్ణయించారు. జేబీ మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిద్ధి ఇద్నాని కథానాయికగా నటించింది.
* రానా దగ్గుబాటి త్వరలో రెజ్లర్ గా నటించనున్నాడు. ప్రముఖ మల్లయుద్ధ వీరుడు కోడి రామ్మూర్తి బయోపిక్ గా రూపొందే చిత్రంలో ఆయన పాత్రను పోషించడానికి రానా ఓకే చెప్పినట్టు సమాచారం.