నువ్వు అసభ్యంగా కనిపిస్తూ, మరో మహిళను అంటావా? రకుల్ ప్రీత్ పై నెటిజన్ల నిప్పులు!

నువ్వు అసభ్యంగా కనిపిస్తూ, మరో మహిళను అంటావా? రకుల్ ప్రీత్ పై నెటిజన్ల నిప్పులు!

“నీపై వచ్చిన కామెంట్స్‌ కు కౌంటర్‌ ఇచ్చేందుకు నువ్వు కూడా ఓ మహిళనే అవమానిస్తావా?” అని ఒకరు, “అసలు నువ్వు ఎలాంటి డ్రస్ వేసుకున్నావో తెలుసా?” అని ఇంకొకరు, “నీ వాలకం చూస్తుంటే ఎలాగైనా అనుకోవచ్చు” అని మరొకరు… ఇలా సాగుతోంది రకుల్ ప్రీత్ పై నెటిజన్ల ట్రోలింగ్. ముంబైలో పొట్టి దుస్తులతో కారు దిగుతున్న రకుల్ ఫోటోలు వైరల్ కాగా, ఓ యువకుడు పెట్టిన మెసేజ్ పై రియాక్ట్ అవుతూ, అతని తల్లిని ఈ వివాదంలోకి లాగడంపై నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. రకుల్ కామెంట్ ను అతి కొద్దిమంది మాత్రమే సమర్ధిస్తుండగా, పలువురు విమర్శిస్తున్నారు. ఇక తనపై వస్తున్న ట్రోలింగ్ ను చూస్తున్న రకుల్, తన ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించింది. “నా నీతి, నిజాయితీలను ప్రశ్నిస్తున్నవారు మహిళలను లక్ష్యం చేసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఇటువంటి కుంచిత మనస్కులకు బుద్ధి చెప్పేందుకు నాకు వచ్చిన పదాలను నేను వాడాను. వారికి కూడా ఓ కుటుంబం ఉందని గుర్తు చేయాలన్నదే నా అభిప్రాయం. నాపై వచ్చిన కామెంట్లే వారిపైనా వస్తే..? అతని తల్లి లాగి ఒకటిస్తుందనే అనుకుంటున్నా” అని వ్యాఖ్యానించింది.