నాగార్జున, నానిల ‘దేవదాస్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

  • ఆకట్టుకుంటున్న ‘దేవదాస్’ ఫస్ట్ లుక్
  • గన్, మందు బాటిల్ తో నాగ్
  • మెడలో స్టెతస్కోప్ తో నాని

టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వస్తున్న మల్టీస్టారర్ ‘దేవదాస్’. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే విడుదల చేసిన లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నాగ్ ఓ చేతిలో గన్, మరో చేతిలో మందు బాటిల్ పట్టుకుని ఉండగా, నాని మెడలో స్టెతస్కోప్ వేసుకుని ఉన్నాడు. వీటితోనే వీరిద్దరూ బెడ్ పై నిద్రిస్తున్నారు. సెప్టెంబర్ 27న నిద్రలేవబోతున్నారంటూ పోస్టర్ పై ఉంది.

ఈ ఫొటోను అప్ లోడ్ చేసిన నాగార్జున… ‘సాధారణంగా నా పక్కన పారూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం దాస్ తో చిక్కుకుపోయా’ అంటూ ట్వీట్ చేశారు.