నగరంలో ఎండలు దంచి కొడుతున్నాయి

  •  హైదరాబాద్ జంట నగరాల్లో ఎండలతో జనం బేజారు 
దేశంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్ 1వ నుంచి ఎండ తీవ్రత గణనీయంగా పెరిగిందని పూణే వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.  మంగళవారం నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలుల ప్రభావం పెరిగిందని పూణే వాతావరణ కేంద్రం ప్రధానాధికారి అనుపమ్ కశ్యప్ వెల్లడించారు.  నగరంలో ఎండలు దంచి కొడుతున్నాయి గత కొన్ని రోజులుగా హైదరాబాద్ జంట నగరాల్లో ఎండలు  మండిపోతుండడంతో జనం బేజారవుతున్నారు  . విదర్భ, మరఠ్వాడ, తెలంగాణ ప్రాంతాల్లో ఎండల ప్రభావం అనూహ్యంగా పెరిగింది. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మధ్య మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌‌ఘడ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలుల తీవ్రత పెరిగిందని అనుపమ్ పేర్కొన్నారు. ఉత్తరాది నుంచి వేడిగాలుల ప్రభావం వల్ల ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి అనూహ్యంగా ఎండతీవ్రత పెరిగింది.   ఎండలో తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కార్యాలయాలకు వెళ్లేటపుడు గొడుగు తీసుకొని వెళ్లాలని, వదులైన కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. వేసవిలో అధికంగా నీరు తాగడంతో పాటు వడదెబ్బ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావారణ శాఖ అధికారులు కోరారు.