దగ్గుబాటి చేరికతో వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి.. రోటరీ భవన్ లో సమావేశం

దగ్గుబాటి చేరికతో వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి.. రోటరీ భవన్ లో సమావేశం

  • దగ్గుబాటి చేరికను వ్యతిరేకిస్తున్న వైసీపీ శ్రేణులు
  • అధికారం ఎక్కడుంటే.. దగ్గుబాటి అక్కడ ఉంటారంటూ వ్యాఖ్య
  • పార్టీ కోసం పని చేస్తున్నవారికి అన్యాయం చేయవద్దంటూ అధిష్ఠానానికి విన్నపం

మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ లు వైసీపీ అధినేత జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ వైసీపీలో చేరబోతున్నారు. అయితే, వీరి రాకపై వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. దగ్గుబాటి రాకను వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా పర్చూరులో ఉన్న రోటరీ భవన్ లో ఈరోజు వైసీపీ నేతలు సమావేశమయ్యారు. అధికారం ఎక్కడుంటే అక్కడకు చేరుకోవడం దగ్గుబాటి నైజమని… ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతున్న తరుణంలో, ఈ పార్టీలో చేరబోతున్నారని ఈ సందర్భంగా వారు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేస్తున్నవారికి అన్యాయం చేయవద్దని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. దగ్గుబాటి కుటుంబానికి టికెట్ ఇవ్వడం మంచిది కాదని విన్నవించారు.