‘తేజ్.. ఐ లవ్యూ’ షూటింగ్ పూర్తి

‘సాక్ష్యం’ నైజాం హక్కులు దిల్ రాజు సొంతం
రవితేజ సినిమా సెన్సార్ పూర్తి
‘భరత్ అనే నేను’ మలయాళంలోకి కూడా!
* సాయి ధరం తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ‘తేజ్ .. ఐ లవ్యూ’ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించుకునే ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
* బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘సాక్ష్యం’ చిత్రం నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 14న విడుదల చేస్తారు.
* రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘నేల టిక్కెట్టు’ చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ లభించింది. మాళవిక శర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేస్తున్నారు.
* మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘భరత్ అనే నేను’ చిత్రం మలయాళంలోకి కూడా డబ్ అవుతోంది. ‘భరత్ ఎన్న అంజాన్’ పేరిట ఈ చిత్రాన్ని ఈ నెల 25న కేరళలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజున తమిళ వెర్షన్ ని కూడా రిలీజ్ చేస్తారు.