home page

కార్పొరేట్ లకు దోచుపెడుతున్న మోడీ సర్కారు

తీవ్రంగా ధ్వజమెత్తిన కేసిఆర్

 | 
Kcr

కార్పొరేట్లకు దోచిపెట్టడం మానుకోవాలి.. 
కేంద్రానికి కేసీఆర్ సూచన

రైల్వేలు, ఎయిర్‌పోర్టులు అన్నీ ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తంచేశారు. 

చివరకు అగ్రికల్చర్ మార్కెట్లను కూడా ప్రైవేటు పరం చేయడం ఏంటని మండిపడ్డారు. ఏం దిక్కుమాలిన దౌర్భాగ్యం ఇదని అడిగారు. భారత బ్యాంకుల నుంచి లక్షల కోట్లు విత్‌డ్రా చేసుకొని విదేశాలకు పారిపోతున్నారని, దీనిపై ప్రభుత్వం ఏం చేస్తోందని అడిగారు. ఇలా ఒకపక్క కార్పొరేట్లకు దోచిపెడుతూ.. పేద ప్రజలకు ఇచ్చే ఉచితాలు ఇవ్వొద్దని చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

కార్పొరేట్ దొంగలకు ఇలా లోన్లు ఇవ్వడం ఉచితాలు కాదా? అని అడిగారు. ఇదేనా మేకిన్ ఇండియా అంటే అన్నారు. ‘‘నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్తే.. నాలుగు నిమిషాలు మాట్లాడి, నాలుగు గంటలు కూర్చుంటాం. మనం మాట్లాడితే వాళ్లపై ప్రభావం పడదు. ఇలా మీటింగ్ బహిష్కరిస్తే అయినా వాళ్లకు మా ఆవేదన వ్యక్తం అవుతుందనే ఇలా చేస్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి మీటింగ్ బహిష్కరించడంపై దేశం అంతా చర్చిస్తుంది. అప్పుడైనా ప్రధానికి ఈ విషయం అర్థం అవుతుంది’’ అని కేసీఆర్ అన్నారు.