home page

కేసీఆర్- కుమారస్వామి భేటీ

ప్రగతి భవన్లో చర్చలు  

 | 
kumaracswamy kcr

జాతీయ ప్రత్యామ్నాయంపై చర్చ  

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జనతాదళ్ ఎస్ నాయకులు కుమారస్వామి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారంనాడు ప్రగతిభవన్లో సమావేశమయ్యారు  .దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు బిజెపి ప్రతిపక్ష పార్టీలను ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్న అంశాలను ఈ సమావేశంలో చర్చించారు  .కర్నాటకలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయాన్ని సమావేశం చర్చించింది  .దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతానికి కాంగ్రెస్సేతర, కాంగ్రెస్ కూడిన ప్రతిపక్షాల ఐక్యత గురించి సమావేశంలో చర్చకు వచ్చింది  .దేశ వ్యాప్తంగా ఇటీవల కేసీఆర్ అటు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్నూ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తోనూ చర్చలు జరిపారు .పంజాబ్లో కూడా రైతులకు నష్టపరిహారం చెల్లించారు  .జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తున్న కెసిఆర్  పలువురితో చర్చిస్తున్నారు.